త్వరలో.. హైదరాబాద్‌కు సరికొత్త ఇమేజ్‌?

Chakravarthi Kalyan
త్వరలో శాస్త్ర పరిశోధనలకు హైదరాబాద్ ఓ పర్యాటక ప్రాంతంగా మారుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అంటున్నారు. హైదరాబాద్ ను సైన్స్ సిటీగా మార్చి అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అంటున్నారు. హైదరాబాద్‌లోని సైన్స్ ఎక్స్ పీరియన్స్ కేంద్రానికి ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రితో కలిసి జితేంద్ర సింగ్‌ శంకుస్థాపన చేశారు. 21వ శతాబ్దం సైన్స్ అండ్ టెక్నాలజీదేనని, ఇప్పటికే అన్ని రంగాలకు హబ్ గా ఉన్న నగరం ఈ కేంద్రం ఏర్పాటుతో విజ్ఞాన రాజధానిగా మారుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. యువత ఆధునిక విజ్ఞానాన్ని తెలుసుకోవడమే కాదు పరిశోధనలకు కూడా  ఇది ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి అన్నారు.

యువతలో సైన్స్ పట్ల ఆసక్తి పెంచాలని, నూతన విద్యా విధానంలో కూడా శాస్త్ర పరిశోధనలకు చోటు కల్పించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. సంస్కృతి లేకుండా శాస్త్రం లేదని.. రెండింటికీ అవినాభావ సంబంధం ఉందని కిషన్‌ రెడ్డి అన్నారు. 2047కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే వికసిత్ భారత్ లక్ష్యమని కిషన్‌ రెడ్డి  చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: