తెలంగాణకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్‌..?

Chakravarthi Kalyan
తెలంగాణకు కేంద్రం గుడ్‌ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని కేంద్రం ఏర్పాటు చేయబోతోంది. ఈ సంస్థను కేంద్ర  ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేసింది. కేంద్ర జౌలి శాఖ కార్యదర్శి ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో ఐఐటీహెచ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సమర్పించారు. రాష్ట్రంలో ఐఐహెచ్ టీ త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను కోరారు.
కేంద్రం వెంటనే స్పందించింది. ఐఐహెచ్ టీ మంజూరుతో స్వరాష్ట్రంలోనే విద్యార్థులు హ్యాండ్ లూమ్  డిప్లొమా, డిగ్రీ కోర్సులు చదివే అవకాశం ఏర్పడిందని వ్యవసాయ, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆ కోర్సుల కోసం రాష్ట్ర విద్యార్థులు ఏపీ, ఒడిశాకు వెళ్లాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర జౌళి పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: