రైతుల కోసం హైదరాబాద్‌లో అద్భుత ప్రదర్శన?
అలాగే ఆయిల్‌పాం మొక్కలు, ఉత్పత్తులు, ట్రాక్టర్లు, యంత్రాలు, ఇతర పనిముట్లు, డ్రోన్ టెక్నాలజీ, నానో యూరియా లిక్విడ్, ఇతర సేంద్రీయ ఉత్పత్తులు ఈ అగ్రిటెక్ సౌత్‌లో ప్రదర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు ఈ ప్రదర్శన తిలకించేందుకు పోటెత్తుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ బి.గోపి, సీఐఐ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.