పెళ్లిళ్లు ముఖ్యమా.. అసెంబ్లీ ముఖ్యమా?

Chakravarthi Kalyan
పెళ్లిళ్ల పేరుతో బీఆర్‌ఎస్‌ నేతలు అసెంబ్లీకి రాకపోవడంపై ప్రభుత్వ విప్‌లు ఆదిశ్రీనివాస్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనసభలో బీఆర్‌ఎస్‌ నాయకులు వ్యవహరించిన తీరును కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తీవ్రంగా విమర్శించారు. శాసన సభ సాఫీగా జరగడం బీఆర్‌ఎస్‌ నాయకులకు ఇష్టం లేదా అని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించారు. శాసనసభకు ప్రతిపక్ష నేత రాకుండా పోవడాన్ని ఆయన తప్పించుకుంటున్నారని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు.
మేడిగడ్డపై మాట్లాడేందుకు రాకుండా.. నల్లగొండ సభకు వెళ్లి ప్రభుత్వాన్ని తిట్టడం ఏమిటని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా సలహాలు ఇవ్వమంటే...ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతిని బయటపెట్టడానికి మేడిగడ్డకు పోయినట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. అవినీతి ఎక్కడ బయట పెడుతుందో అని సభ నుంచి బయటికి పారిపోయారని ఆరోపించారు. పులి బయటికి రాలేదు కాని పిల్లి మాత్రం బయటికి వచ్చిందని కాంగ్రెస్‌ నేతలు అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు అసెంబ్లీ ప్రాంగణలో ధర్నా చేయడం ఒక బూటకమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: