దేశమంతా ఎదురుచూసిన రోజు వచ్చేసింది?

Chakravarthi Kalyan
దేశమంతా ఎదురుచూసిన రోజు వచ్చేసింది. వందల ఏళ్ల తరబడి హిందువులు ఎదురు చూసిన రోజు వచ్చేసింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరగనుంది. భవ్య, దివ్య రామమందిరంలో కన్నులపండుగగా జరగనున్న ప్రాణప్రతిష్ఠాపనోత్సవం కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. మధ్యాహ్నం 12.05 గం. నుంచి 12.55 గం. వరకు ప్రాణ ప్రతిష్ఠ క్రతువు జరుగుతుంది.
ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన చేయనున్నారు. వేద మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల మధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపన జరగనుంది. మహా క్రతువులో 7 వేల మంది అతిథులు పాల్గొంటారు. కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు.. అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది. అయోధ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశమంతా పండుగ చేసుకుంటోంది. రామాలయాల్లోనే కాకుండా అనేక దేవాలయాల్లో ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతా ఇది తమ ఇంటి కార్యంగా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: