ఇవాళే రేవంత్ రెడ్డి ప్రమాణం.. ఇవి మర్చిపోవద్దు?
సుజాత స్కూల్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లిస్తారు.నగరవాసులు ఎల్బీ స్టేడియానికి వచ్చే దారుల్లో కాకుండా ప్రత్యామ్నయ దారులు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. రవీంద్ర భారతి, ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ కాంప్లెక్స్, బషీర్‌బాగ్, ఎస్బీఐ గన్‌ఫౌండ్రి, అబిడ్స్ సర్కిల్, లిబర్డీ, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్ కూడళ్ల వద్ద వాహనాలు బారులు తీరే అవకాశం ఉంది. ఏదైనా అసౌకర్యం ఏర్పడితే 910203626 హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.