ఇజ్రాయెల్ దాడులకు మోదీ మద్దతు ఇచ్చారా?

Chakravarthi Kalyan
పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ దాడులు చేస్తుంటే దానికి పూర్తిగా ప్రధాని మోది మద్దతు ఇచ్చారని కమ్యూనిస్టులు ఆరోపిస్తున్నారు. దీనికి భారాసగాని, కాంగ్రెస్‌గాని బయటకు వచ్చి ఇది అన్యాయం అక్రమం అని ఖండించలేదని అంటున్నారు. అంబేడ్కర్‌ రాసిన పార్లమెంటరీ రాజ్యాంగం నాశనం శాసనం చేస్తున్నారన్నారు. రాష్ర్టాల హక్కులు కాలరాస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని భాజపా నాశనం చేస్తుంటే దాన్ని ప్రశ్నించకుండా, దానిమీద పోరాటం చేయకండా 170 అడుగులు అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుచేశారని దుయ్యబట్టారు.

అన్ని అసమానతలు తొలగించి, సామాజిక న్యాయం స్థాపించడానికి రాజ్యాంగంలో ఉందన్నారు.  రాష్ర్టంలో కార్మికవర్గానికి, పోరాటానికి స్వేచ్చలేకుండా రాష్ర్ట ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్‌ వాళ్లు చేశారని పక్క రాష్ర్టంలో ఆంధ్రలో కూడా అలాగే జరుగుతుందని, కేంద్రంలో జంతర్‌మంతర్‌ వద్దకూడా ఆందోళన చేసేందుకు వీలు లేకుండా చేశారని ఆరోపించారు. దీనిపై పోరాడతానని అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: