బీఆర్ఎస్కు షాక్.. సొంత పార్టీ మహిళానేత దీక్ష?
ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి తమ గోడును చెప్పుకునేందుకు యత్నించిన కుదరడం లేదని లింగాల శోభారాణి అన్నారు. భారాస పార్టీలో అగ్రవర్ణాలకు చెందిన మహిళలకు మాత్రమే అవకాశాలు లభిస్తాయని.. గతంలో జరిగిన రెండు పర్యాయాల ఎన్నికల్లో బిసి మహిళలకు అన్యాయం జరిగిందని లింగాల శోభారాణి అన్నారు. త్యాగాలు తాము చేస్తుంటే... భోగాలు అగ్రవర్ణాల మహిళలు అనుభవిస్తున్నారని లింగాల శోభారాణి తెలిపారు.