నాలుగు రాష్ట్రాల్లో గోల్డ్ స్కామ్.. రంగంలోకి ఈడీ?
ఈ స్కామ్‌పై ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర పోలీసులతో పాటు సీబీఐ ఒరిస్సా విభాగం కూడా అక్షయ గోల్డ్ పై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరిపాయి. ఆ దర్యాప్తు ఆధారంగా మనీలాండరింగ్ అంశాలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. అధిక వడ్డీ, స్థలాల పేరిట ఆశచూపి ఆర్బీఐ, సెబి అనుమతి లేకుండా లక్షల మంది నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు అక్షయ గోల్డ్ పై అభియోగాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలోని 376 స్థిరాస్తులు సహా సుమారు 268 కోట్ల 24 లక్షల రూపాయల విలువైన ఆస్తులను ఈ కేసులోఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది.