పాక్ ప్రధాని, ఆర్మీ చీప్ తాలిబాన్లకు హెచ్చరికలు చేశారు. పాక్ భూభాగంలో ఎలాంటి తీవ్ర వాద కార్యకలాపాలకు పాల్పడిన చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అదే సమయంలో ఇండియాలో కూడా పాకిస్థాన్ పీవోకే అనే పేరుతో కాశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. మరి దీనికి ఎవరు సమాధానం చెబుతారు. అక్కడ తాలిబాన్ల విషయంలో తమ భూభాగంలోకి వస్తే ఊరుకునేది లేదని చెబుతున్నారు. మరి ఇక్కడ మాత్రం ఇండియాలోని కాశ్మీర్ ను ఆక్రమించుకోడం సరైన విషయమా అని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు.
అక్కడ తాలిబాన్లతో పాక్ భూభాగం గురించి యుద్దం చేస్తే ఇండియా కూడా ఇక్కడ పీవోకే గురించి యుద్ధం చేయడంలో ఎలాంటి తప్పు లేదని అంటున్నారు. పీవోకేను స్వాధీనం చేసుకోవడానికి ఇండియాకు కూడా అదే సరైన సమయం అని చెబుతున్నారు. మరి తాలిబాన్లపై పాక్ సైన్యం ఎలాంటి దాడులకు తెగబడనుందో తాలిబాన్లు ఎలా ఎటాక్ చేస్తారో త్వరలోనే తేలిపోనుంది.