ఇన్‌స్టాలో ఫ్రెండ్‌షిప్‌.. 8 పెళ్లిళ్లు చేసుకున్న కిలాడీ?

Chakravarthi Kalyan
సోషల్ మీడియాలో అందమైన అమ్మాయి ప్రొఫైల్ కనిపిస్తే చాలు చొంగ కార్చేవారెందరో.. అలాంటి వారి బలహీనతలను ఆసరా గా చేసుకుని కొందరు అమ్మాయిలు మోసాలు చేస్తున్నారు.  తాజాగా ఇలాంటి ఓ యువతి వ్యవహారం బయటపడింది. ఓ కిలాడీ ఆంధ్రప్రదేశ్‌ తో పాటు అనేక  రాష్ట్రాల్లో ఎనిమిది మందిని వివాహం చేసుకుని నగలు, నగదుతో పారిపోయింది. ఇప్పుడు ఆ  యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్‌ మూర్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో రషీద అనే అమ్మాయి పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు

ఈ ఏడాది మార్చి 30న పెళ్లి కూడా చేసుకున్నారు. కొన్ని రోజులకే గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో రషీద ఇంట్లో ఉన్న రూ.1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారు నగలతో పారిపోయింది. మూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. అయితే విచారణలో షాకింగ్‌ విషయాలు వెలుగు చూశాయి. నీలగిరి జిల్లా గూడలూర్‌కు చెందిన రషీద..  సామాజిక మాధ్యమాల్లో డబ్బున్న మగవారితో పరిచయం పెంచుకుంటుందని.. తర్వాత వారిని వివాహం చేసుకుంటుందని..  కొన్ని రోజుల తర్వాత నగదు, నగలతో పారిపోతుందని గుర్తించారు. ఈ అమ్మడి ఇప్పటి వరకూ 8 పెళ్లిళ్లు చేసుకుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: