నోరుజారిన రేవంత్.. డిఫెన్సులో పడిన కాంగ్రెస్?
రేవంత్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై మాట్లాడారని.. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉచిత విద్యుత్ ప్రారంభించిన విషయం టిఆర్ఎస్ నాయకులకు గుర్తుండాలని మల్లు రవి అన్నారు. వైస్సార్ ఉచిత విద్యుత్ కోసం పోరాటం చేస్తుంటే కేసీఆర్ చంద్రబాబు ఇద్దరు వ్యతిరేకించారని.. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ కు కట్టుబడి ఉందని.. రేవంత్ రెడ్డి అక్కడ విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించలేదని.. కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకటించాలంటే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ లో నిర్ణయం తీసుకుంటుందని మల్లు రవి అన్నారు. మేము రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు పని చేస్తామన్న మల్లు రవి... రైతులను తప్పు దోవ పట్టించడానికే కేటీఆర్ ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.