విజయ్ సేతుపతి పక్కన కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్..మణిరత్నం మైండ్ బ్లోయింగ్ కాంబో..!?
తాజా సమాచారం ప్రకారం, ఈ ఇద్దరూ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించబోతున్నారని చెన్నై సినిమా వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇది ప్రేమకథ నేపథ్యంతో రూపొందే సినిమా అని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. విజయ్ సేతుపతి – సాయి పల్లవి ఇద్దరూ ఈ సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపారన్న వార్త ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.ఈ ప్రాజెక్ట్‌ను జనవరిలో అధికారికంగా ప్రకటించి, షూటింగ్‌ను ఏప్రిల్ నెలలో ప్రారంభించే అవకాశాలున్నాయని సమాచారం. అయితే మణిరత్నం – విజయ్ సేతుపతి – సాయి పల్లవి కాంబినేషన్ నిజమైతే, ఇది ప్రేక్షకులకు మరింత ఆసక్తి రేకెత్తించే అంశం కావడం ఖాయం. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో ప్రేమకథలు ఎలా ఉండబోతాయో ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురు చూస్తారు.
ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, నవాబ్ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతికి ఇది రెండో చిత్రం అవుతుంది. మరోవైపు సాయి పల్లవి మాత్రం మణిరత్నం దర్శకత్వంలో నటించడం ఇదే తొలి అవకాశం. అందువల్ల ఈ ప్రాజెక్ట్ సాయి పల్లవికి కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన మైలురాయిగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. మణిరత్నం చిత్రాల్లో సాధారణ ప్రేమకథలు కూడా కవిత్వంలా ఉండే విధంగా తెరకెక్కే తీరు ప్రత్యేకం. ఆయన దర్శకత్వం అంటే భావోద్వేగం, శైలీ, అద్భుతమైన సంగీతం, క్లాసికల్ రొమాన్స్… ఇవన్నీ కలిసి సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. ఆ తరహా సినిమాలో సాయి పల్లవి మరియు విజయ్ సేతుపతి కలిసి నటించబోతున్నారంటే, స్వభావ సౌందర్యం మరియు నటనా ప్రతిభ కలిసిన ప్రత్యేక జోడీని చూస్తామనే నమ్మకం అభిమానుల్లో ఇప్పటికే పెరిగింది.
ఇకపోతే, ఈ చిత్రం అధికారిక ప్రకటన రాగానే తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ ఆసక్తి పెరగడం ఖాయం. ప్రస్తుతం ఇది ప్రాథమిక స్థాయిలో ఉన్న పుకారు అయినా, త్వరలో నిజ నిర్ధారణ వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ జోడీ కాంబినేషన్ ఇప్పటికే సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.