2025: ఏడాది ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేసిన పదాలివే..?

Divya
మరో కొద్ది రోజులలో 2025 ఏడాది ముగిసిపోయి 2026 న్యూ ఇయర్ రాబోతోంది. అయితే ఈసారి ఇండియాలో ప్రజలు ఏ విషయం పైన ఎక్కువ ఆసక్తి చూపారనే (సెర్చింగ్ )విషయంపై జాబితాను గూగుల్ విడుదల చేసింది. ఈ ఏడాది ఎక్కువగా క్రికెట్ ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంటర్టైన్మెంట్ గురించి ఎక్కువగా సెర్చ్ చేసిన పదాలు వైరల్ గా మారుతున్నాయి. మరి ట్రెండింగ్ జాబితాల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.


ఈ ఏడాది టాప్ రన్నింగ్ సెర్చింగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అగ్రస్థానంలో ఉంది, రెండవ అత్యధికంగా సెర్చింగ్ చేసిన పదాలలో జెమిని ఏఐ.

క్రికెట్ సంబంధించిన విషయానికి వస్తే..
ఆసియా కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, మహిళా ప్రపంచకప్ వంటి వాటిని ఎక్కువగా సర్చ్ చేశారు. అలాగే సైయారా, ధర్మేంద్ర, మహాకుంభమేళా వంటి పదాలను కూడా ఎక్కువగా గూగుల్లో సర్చ్  చేసినట్లుగా తెలియజేశారు.


Ai విభాగంలో అత్యధికంగా సెర్చ్ చేసిన పదాలలో జెమిని అగ్రస్థానంలో కలదు. ఆ తర్వాత గ్రోక్, డీప్ సిక్, చాట్ జిపిటి వంటివి ఉన్నాయి.

2025 ఏఐ జాబితా టాప్ ట్రెండ్ విషయానికి వస్తే:
జెమిని, జెమిని ఏఐ ఫోటో, గ్రోక్, deepseek, గూగుల్  ఏఐ స్టూడియో, చాట్ జిపిటి, చాట్ జిపిటిగిబిల్ ఆర్ట్, ఫ్లో, Ghibli style image generator వంటి పదాలు కలవు.


గూగుల్ ట్రెండింగ్ జాబితాలో జెమిని ట్రెండ్ అనే పదం అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ghibli trend, 3D model trend, gemini saree trend వంటి పదాలను కూడా ఎక్కువగా వెతికినట్లు తెలిసింది.

టీవీ షోలు సినిమాల సెర్చ్ జాబితా విషయానికి వస్తే:
సైయారా, కాంతారా చాప్టర్ 1, కూలి, వార్2, sanam teri kasam


టీవీ షోల విషయానికి వస్తే:
స్క్విడ్ గేమ్,panchayat, బిగ్ బాస్, ది బాట్స్ ఆఫ్ బాలీవుడ్, paatal lok


అలాగే ఈ ఏడాది భూకంప అప్డేట్స్, పికిల్ బాల్స్, సైయారా , AQI లెవెల్స్ వంటి పదాలు అగ్రస్థానంలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: