అఖండ 2 : వచ్చే సంవత్సరమే.. దానితో ఫుల్ క్లారిటీ..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మించారు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 4 వ తేదీన ప్రదర్శించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ ప్రీమియర్ షో లకు మరియు రెగ్యులర్ షో లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ను కూడా ఓపెన్ చేశారు. అంతా ఓకే అయ్యింది. సినిమా విడుదల అవుతుంది అనుకునే లోపే డిసెంబర్ 4 వ తేదీ సాయంత్రం సమయంలో ఈ సినిమా ప్రీమియర్ షో లు క్యాన్సల్ అయ్యాయి అని మొదట వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షోస్ కూడా క్యాన్సల్ అయ్యాయి అని వార్తలు వచ్చాయి.


ఈ మూవీ బృందం కూడా ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అయ్యింది అని అధికారికంగా ధ్రువీకరించింది. దానితో ఒక్క సారిగా బాలయ్య అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన కాకపోయిన డిసెంబర్ 6 వ తేదీన ఆయన విడుదల అవుతుంది అని బాలయ్య అభిమానులు అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యి చాలా రోజులే అవుతున్న ఇప్పటికీ ఈ మూవీ విడుదలపై ఎలాంటి అప్డేట్ను మూవీ నిర్మాతలు విడుదల చేయలేదు. ఇకపోతే ప్రస్తుతం బుక్ మై షో ఆప్ లో ఈ మూవీ విడుదల తేదీ దగ్గర 2026 అని చూపిస్తోంది. దానితో ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కు విడుదల అయ్యే అవకాశం ఉంది అని చాలా మంది భావిస్తున్నారు. మరి ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో అనే దానిపై క్లారిటీ రావాలి అంటే ఈ మూవీ నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: