బెంగాల్లో సంచలనం.. ఇన్ని లక్షల మంది ఓటర్లను తొలగించారా?

Pandrala Sravanthi
పశ్చిమ బెంగాలలో ఓటర్ జాబితా  సవరణలో భాగంగా లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో బూత్ స్థాయి ఆఫీసర్స్ సేకరించినటువంటి పత్రాల డిజిటైజేషన్ సరళిని బట్టి దాదాపుగా 47 లక్షల పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితా తొలగించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాను  డిసెంబర్ 16న  ప్రచురించబోతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు  సోమవారం సాయంత్రం జరిగినటువంటి డిజిటైజేషన్ ఆధారంగా ఈ అంచనా వేసినట్టు తెలుస్తోంది. ఈ యొక్క ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం అందరి సమాచారం. 


ఇది కాకుండా అక్టోబర్ 27 నాటికి  బెంగాల్ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7,66,77,529 గా నమోదయింది.. ఇందులో 43.30 లక్షల పేర్లలో అత్యధికంగా 21.45 లక్షల మంది ఓటర్లు మరణించిన వారే ఉన్నారు. సుమారుగా 15.10 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారున్నారు. అంతేకాకుండా 5.5 లక్షల మంది ఆచూకీ తెలియని వారు ఉన్నారు. ఇవే కాకుండా బోగస్ లేదా నకిలీ ఓటర్ల సంఖ్య 1 లక్ష కంటే ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది.ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ క్షుణ్ణంగా ఓటర్ల జాబితాను పరిశీలించి అందులో నుంచి దాదాపుగా 47 లక్షలకు పైగా తొలగించడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


అలాగే కుచ్ బీహార్, హుగ్లీ,  సౌత్ 24 జిల్లాలోని మూడు పోలింగ్ బూతుల్లో, ప్రస్తుత ఓటర్ల జాబితా 2002 నాటి జాబితాతో అస్సలు సరిపోవడం లేదు. వీటన్నింటిపై ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ విధంగా పశ్చిమబెంగాల్ లో ఎలక్షన్ కమీషన్ ఓటర్ జాబితా ను క్షుణ్ణంగా పరిశీలించి, అందులో నుంచి  చనిపోయినవి, మిస్సింగ్ అయినవి, అడ్రస్ సరిగా లేని ఓటర్లను తొలగించే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ 16 నాటికి ఈ సంఖ్య 47 లక్షలు దాటి 70 లక్షలకు వెళ్ళినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: