ఆ రైతులకు బ్యాడ్‌ న్యూస్‌.. వెయిటింగ్‌ తప్పదు?

Chakravarthi Kalyan
తెలంగాణలో పోడు భూముల పట్టాల పంపిణీ ఆలస్యం కానుంది. ఇవాళ్టి నుంచి పోడు పట్టాల పంపిణీ ప్రారంభం కావాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2845 గ్రామాలు తాండాలు, గూడేల పరిధిలో ఆదివాసీ, గిరిజనుల ఆధ్వర్యంలో ఉన్న 4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు రెడీ చేశారు. వీటి ద్వారా 1,50,224 మంది గిరిజనులకు మేలు చేకూరనుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ చేయాలని మొదట ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
అయితే శాసనసభ ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ కు వచ్చింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఈసీ బృందం సమావేశం నిన్న జరిగింది. కలెక్టర్లు, ఎస్పీలతో ఇవాళ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులతో ఈసీ బృందం సమావేశం అవుతోంది. దీనివల్ల పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: