జగన్‌: మాట తప్పాడా..నిలబెట్టుకున్నాడా?

Chakravarthi Kalyan
10వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించి సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నాడని వైసీపీ నేతలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలుగా విడిపోయాక కూడా   అవిభాజ్య ఏపీలో 2014కు ముందు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ క్రమబద్దీకరిస్తామని జగన్‌ ఆనాడు పాదయాత్రలో హమీ ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీ మేరకు ఈరోజు సుమారు 10వేల పైచిలుకు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. మాటతప్పం.. మడమతిప్పమని.. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే.. అంటూ గొప్పగా చెబుతున్నారు.

ఎన్నాళ్లుగానో ఎదురు చూసి అలసిపోయిన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ కలను మనసున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నెరవేర్చారని.. అందుకే వారంతా పాలాభిషేకాలు చేస్తూ కీర్తిస్తున్నారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఒడిదుడుకుల మధ్య ఇలా కాదు.. అలా చేద్దామని ఉద్యోగులతో సంప్రదింపులు చేసిన పరిస్థితులు తప్పితే మేం ఎక్కడా వారిని నిర్లక్ష్యం చేసిన దాఖలాల్లేవని అంటున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సంగతి ఓకే.. కానీ.. సీపీఎస్‌ను వారంలో రద్దు చేస్తామంటూ ఇచ్చిన హామీ సంగతేంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: