తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే స్వీడన్ కంపెనీలను మంత్రి కేటీఆర్ స్వాగతించారు. పెట్టుబడులకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానమని ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే స్వీడన్ కంపెనీలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కేటిఆర్ ప్రకటించారు. హైదరాబాద్ చేరుకున్న స్వీడన్ రాయబారి బృందంతో మంత్రి కేటిఆర్ సమావేశమయ్యారు. స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్‌తో మంత్రి కేటిఆర్ చర్చించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ ఆలోచన విధానాన్ని వారికి మంత్రి కేటిఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాల గురించి మంత్రి కేటిఆర్ చెప్పారు. టెక్నాలజీ, తయారీ రంగాల్లో స్వీడన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటిఆర్ కోరారు. ఈ దిశగా భారత దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న కంపెనీలను తెలంగాణకు మంత్రి కేటిఆర్ ఆహ్వానించారు.