జోషి మఠ్‌లో ఏం జరుగుతోంది.. అంత రహస్యం ఏంటి?
జోషిమఠ్‌పై నిపుణుల కమిటీ పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత వాటిని వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఎన్‌డీఎంయే చెబుతోంది. హైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్‌ఐ తో పాడటు ఇతర సంస్థలకు, వాటిలోని నిపుణులకు ఈ మేరకు ప్రత్యేక సూచనను ఎన్‌డీఎంయే పంపించింది. జోషిమఠ్ పరిస్థితిపై ఎవరికివారు భాష్యం చెబుతుండడంతో ఎదురయ్యే అయోమయాన్ని తొలగించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నామని ఎన్‌డీఎంయే అంటోంది. అయితే.. సమస్యను పరిష్కరించేబదులు సమాచారంపై ఆంక్షలు విధించడమేమిటని విపక్షాలు మండిపడుతున్నాయి.