ఇవేం హత్యారాజకీయాలు.. పవన్ సంచలన పోస్ట్?
ప్రణయ్ ని వైసీపీ నేతలు హత్య చేశారని ఆయన తల్లి వరలక్ష్మి.. పవన్ కళ్యాణ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆవేదన చెందిన పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ పరిపాలించే అవకాశం వచ్చిన రోజుల్లో ఈ పరిస్థితి బాధాకరమని వీడియోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.