ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు..అలా రావద్దు అంటూ!
ఈ మేరకు శనివారం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (DPAR) భాగం నుంచి వివిధ శాఖల ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయం, అదనపు ముఖ్యమంత్రి కార్యదర్శులు ఇందుకు సంబంధించి ఉత్తర్వులు పంపారు. ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సిఎస్ పడాక్షరి స్వాగతించారు. ఇటీవల కాలంలో యంగ్ ఉద్యోగస్తులు ఎక్కువగా జీన్స్ , బిగువైన దుస్తులతో విధులకు వస్తున్నారని ఇది చాలా అసభ్యకరంగా కనిపిస్తోందంటూ ఒక అధికారి తెలియజేశారు.
అలాగే ఉద్యోగస్తుల టైమింగ్ విషయంలో కూడా మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ఉదయం 10:10 గంటలకల్లా కార్యాలయంలో ఉద్యోగస్తులు ఉండాలని ఎవరైనా అధికారి పని మీద బయటకు వెళ్తే అందుకు సంబంధించి వివరాలతో కూడిన విషయాలను రిజిస్టర్లో నమోదు చేయాలంటూ సూచించారు. ఉద్యోగులు కార్యాలయానికి వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు కచ్చితంగా రిజిస్ట్రేషన్ లో తమ వివరాలను నమోదు చేయాలంటూ ఆదేశాలను జారీ చేశారు. అలాగే కార్యాలయలకు వచ్చిన సమయంలో , వెళ్లే సమయంలో నగదు వివరాలకు సంబంధించి క్యాష్ డిక్లరేషన్ రిజిస్ట్రేషన్ లో కూడా అందుకు సంబంధించి పూర్తి వివరాలను నమోదు చేయాలంటూ సూచించారు. మరి ఇలాంటి నిర్ణయాలతో అక్కడ ఉద్యోగస్తులలో ఎలాంటి మార్పు తీసుకువస్తుందా చూడాలి మరి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల చాలామంది ప్రశంసిస్తున్నారు.