బంపర్‌ఆఫర్: రూ. 500 కే గ్యాస్ సిలిండర్?
అహ్మదాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ సిలిండర్ అస్త్రం ప్రయోగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. గుజరాత్‌లో ఎల్పీజీ సిలిండర్‌ను రూ.500కే అందిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. అంతే కాదు.. రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తామని కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇంకా రూ.3 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తామన్నారు. బాలికలకు ఉచితంగా విద్య అందిస్తామని.. ఇళ్లకు కూడా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.