సొంత పార్టీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం?

Chakravarthi Kalyan
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పని తీరు మెరుగు పడని కొందరు నేతల విషయంలో నేను నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చిందంటూ హెచ్చరించారు. నేను గట్టిగా తిరుగుతున్నా...మరో వైపు కార్యకర్తలు పోరాడుతున్నారు... కానీ.. కొందరు మాత్రం ఇంకా ఇల్లు కదలడం లేదని చంద్రబాబు మండిపడుతున్నారు. మహానాడు కు క్యాడర్ ఎలా వచ్చారో చూశారు కదా..  ప్రజల్లో, క్యాడర్ లో ఆవేదన ఉంది.. కానీ కొందరు నేతలు ఇంకా తమ పని కూడా తాము చెయ్యడం లేదంటూ చంద్రబాబు మండిపడ్డారు.


పార్టీ మీకు ఇంచార్జీ హోదా ఇచ్చినప్పుడు ఎందుకు కార్యక్రమాలు చెయ్యడం లేదని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. మూడున్నర ఏళ్లు అయ్యింది...నేతలు పనితీరు మెరుగుపరుచుకుంటారని ఇంకా ఎదురు చూసేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. కొందరు నేతలు పనితీరు మెరుగు పరుచుకునేందుకు సమయం కూడా ఇచ్చామని.. ఇక నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటానని.. చంద్రబాబు చెప్పకనే చెప్పేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: