జైలుకెళ్తారు జాగ్రత్త.. ఏపీ హైకోర్టు వార్నింగ్?

frame జైలుకెళ్తారు జాగ్రత్త.. ఏపీ హైకోర్టు వార్నింగ్?

Chakravarthi Kalyan
ఏపీ హైకోర్టు అధికారులకు వార్నింగ్ ఇచ్చింది. నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోతే.. జైలుకు వెళ్తారు జాగ్రత్త అని హెచ్చరించింది. ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం పేదలకు ఉచిత విద్యపై ఇచ్చిన హైకోర్టు తీర్పును అమలు చేయట్లేదని హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై వాదనల సందర్భంగా ఏపీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఏపి విద్యాహక్కు చట్టం కింద ఈయేడాది ఎందుకు సీట్లు కేటాయించలేదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు... పేద పిల్లల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోతే సంబంధిత అధికారులు జైల్లో ఉంటారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వారం రోజుల్లో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను వారం రోజులకు  వాయిదా వేసింది. మరి నిబంధనలు సరిగ్గా పాటించాల్సిందే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More