లైగర్‌: విజయ్‌ సినిమా కోసం చడ్డీ కూడా తీసేస్తాడా?

Chakravarthi Kalyan
సినిమాల కోసం హీరోలు కొన్ని కసరత్తులు చేస్తారు. సినిమాలో హీరో పాత్రకు తగ్గట్టుగా తమను తాము మలచుకుంటారు. ఇక పూరీ సినిమా హీరోలకు ఒక ప్రత్యేక యాటిట్యూడ్‌ ఉంటుంది. తాజాగా వస్తున్న లైగర్‌ లో కూడా విజయ్ దేవరకొండ చాలా సీన్లలో షార్ట్‌తో ఉన్నాడు. దీని గురించి పూరిని ప్రశ్నిస్తే.. విజయ్‌కు సినిమా కథ చెప్పిన తర్వాత తనే క్యారెక్టర్‌ కోసం వర్కవుట్‌ చేశాడన్నారు. విజయ్‌ జుట్టు పెంచాడని... సాధారణంగా హీరోలెవరూ లోయర్‌ చూపించరని.. కానీ అలా చూపించటానికి విజయ్‌కు దమ్ముందని పూరి అన్నారు.

ఈ క్రెడిట్‌ అంతా విజయ్‌ దేవరకొండదేనని.. విజయ్‌ గట్స్‌ చూసి తన మిత్రుడొకరు ఆశ్చర్యపోయారని.. అప్పుడు తాను.. మావాడు సినిమా కోసం చడ్డీ తీసేయమన్నా తీసేస్తాడని చెప్పానని పూరీ గుర్తు చేసుకున్నారు. విజయ్‌ దేవరకొండ కూడా అలాగే మాట్లాడాడు.. నటుడిని అవుదామనుకున్నప్పుడే ఏదైనా చేయడానికి సిద్ధపడ్డానని.. ఒకసారి కమిట్‌ అయితే, చేసేయడమేనని విజయ్‌ అంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: