సంచలనం: ఈ ఏడాది ఆస్కార్‌ ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్‌?

Chakravarthi Kalyan
జూనియర్ ఎన్టీఆర్‌ భారత చలన చిత్ర రంగంలో కొత్త చరిత్ర లిఖించబోతున్నాడా.. ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించబోతున్నాడా.. అంటే అవునంటోంది ఓ హాలీవుడ్ మేగజైన్.. హాలీవుడ్ మూవీ మేగజైన్ వెరైటీ ప్రచురించిన ఓ కథనం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ హీరోలుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఆర్ఆర్‌ఆర్ సినిమా త్వరలో ఆస్కార్‌ అవార్డుల్లోనూ సంచలనం సృష్టించబోతోందట.

ఉత్తమ చిత్రంగా ఆర్ ఆర్ ఆర్.. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్, ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఆస్కార్‌ అవార్డులు గెలుచుకునే అవకాశం ఉందని సదరు హాలీవుడ్ మేగజైన్ ఓ కథనం ప్రచురించడం విశేషం. అదే నిజమైతే.. రాజమౌళి, ఎన్టీఆర్‌ కొత్త చరిత్ర సృష్టించినట్టే. ఇప్పుుడ ఈ కథనాన్ని ఎన్టీఆర్‌, రాజమౌళి ఫ్యాన్స్ నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు. ఆ కథనం నిజం కావాలని మనమూ ఆశిద్ధాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ntr

సంబంధిత వార్తలు: