ఆ మాజీ మంత్రిని బ్లాక్ మెయిల్ చేసి పార్టీ మార్చారా?
ఇప్పుడు వైసీపీ కార్యకర్తలే నాయకుల తీరుపట్ల సంతృప్తిగా లేక తిరుగుబాటు చేసే పరిస్థితి ఉందని నల్లారి అంటున్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఆధ్వర్యంలోనే మైనింగ్ అక్రమాలు జరుగుతున్నాయని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇరువురూ ఓవైపు మైనింగ్ మాఫియా మరో వైపు భూ కబ్జాలు, ఇంకోవైపు లిక్కర్ మాఫియా విచ్చలవిడిగా సాగిస్తున్నారని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మైనింగ్ యజమానులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.