సీఎంను కాల్చిపారేస్తా.. నాయకుడి భార్య వార్నింగ్?
తన భర్త, మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్‌ను సీఎం పినరయి విజయన్ తీవ్రంగా వేధిస్తున్నారట. ఇటీవల లైంగిక వేధింపుల కేసులో పీసీ జార్జ్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఆయన ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చారు. తన భర్త జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో ఉషా జార్జ్ మీడియాతో మాట్లాడారు. తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తన భర్తపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారంటున్న ఉషా జార్జ్.. దీనికంతటికీ సీఎం విజయన్ కారణమని.. అందుకే తుపాకీతో ముఖ్యమంత్రిని కాలుస్తానని వార్నింగ్ ఇచ్చారు.