ఢిల్లీ రైతు ఉద్యమంలాగే అమరావతి ఉద్యమం?

Chakravarthi Kalyan
ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలాగానే అమరావతి ఉద్యమం కూడా విజయవంతం అవుతుందంటున్నారు సీపీఐ నేత బినోయ్‌ విశ్వం.. అమరావతిని రాజధానిగా నిర్మించే వరకూ రైతుల పోరాటానికి అండగా ఉంటామని బినోయ్ విశ్వం అంటున్నారు. రాజధాని ప్రాంతంలో ఆగిన నిర్మాణాలను ఆయన సిపిఐ రాష్ట్ర నేతలతో కలసి పరిశీలించారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో రైతులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి జగన్ నయా తుగ్లక్ గా బినోయ్‌ విశ్వం  అభివర్ణించారు.

దేశంలోని ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటున్నారు కాబట్టే ఆయన ఆధునిక తుగ్లక్ అని బినోయ్‌ విశ్వం కామెంట్ చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం కోసం రాజధాని రైతుల ఆకాంక్షలు చంపుకోవాల్సిన పని లేదని బినోయ్‌ విశ్వం  అన్నారు. రాజధానిలో జరిగిన నిర్మాణాలకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించారన్న బినోయ్‌ విశ్వం .. ఇప్పుడు రాజధాని మార్పు పేరిట జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని  అమరావతిని నిర్మించాలని బినోయ్‌ విశ్వం  డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: