జగన్ విశాఖ ప్రేమపై విడదల రజని షాకింగ్ కామెంట్స్
సీఎం జగన్ చెప్పినవి చెప్పని హామీలు కూడా అమలు చేశారని.. విశాఖ అభివృద్ధికి సీఎం జగన్ ప్రత్యక శ్రద్ధ చూపిస్తున్నారని విశాఖ జిల్లా ఇంచార్జ్ మంత్రి విడదల రజిని అన్నారు. పదే పదే ఋషికొండపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. చంద్రబాబు హయాంలోనూ అభివృద్ధి కోసం కొండలు చదును చేశారని విశాఖ జిల్లా ఇంచార్జ్ మంత్రి విడదల రజిని తెలిపారు. చంద్రబాబు హయాంలో కొండలు చదును చేస్తే అభివృద్ధి.. జగన్మోహన్ రెడ్డి హయాంలో చదును చేస్తే విధ్వంసమా? అని ప్రశ్నించారు.