ఆ జిల్లాలో మరో కొత్త పరిశ్రమ రాబోతోందా?

Chakravarthi Kalyan
చిత్తూరు జిల్లా పారిశ్రామికంగా దూసుకుపోతోంది. తాజాగా అపాచీ పరిశ్రమ కూడా రాబోతోంది. ఈ నెల  23 తేదీన  చిత్తూరు జిల్లాలో అపాచీ పరిశ్రమ ఏర్పాటుకు సీఎం జగన్ భూమి పూజ నిర్వహిస్తారు. శ్రీకాళ హస్తి మండలంలోని ఇనగలూరులో 298 ఎకరాల్లో హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా లిమిటెడ్  పరిశ్రమను స్థాపించనున్నారు.


అపాచీ  పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి మరో 700 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. అలాగే స్థానిక యువత 10వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. గతంలోనే ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్ మెంట్ తో పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. అడిడాస్ బ్రాండెడ్‌ షూస్ తయారీలో అపాచీ చాలా కీలకం. భారత్ తో పాటు వియత్నాం, చైనాలోనూ అపాచీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అపాచీ నెల్లూరు జిల్లా తడలో ఏర్పాటు చేసిన  ఫ్యాక్టరీ ద్వారా ప్రతి ఏటా కోటి 80 లక్షల ఉత్పత్తి జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: