కుక్క కోసం.. వెక్కివెక్కి ఏడ్చిన ముఖ్యమంత్రి?

Chakravarthi Kalyan
నిజమే.. భావోద్వేగానికి గురైతే.. ముఖ్యమంత్రి అయితే.. ఏంటి.. సామాన్యుడు అయితే ఏంటి.. అవును.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెక్కి వెక్కి ఏడ్చారు. అది కూడా తన పెంపుడు కుక్క కోసం.. ఆ  పెంపుడు కుక్క గతేడాది మరణించింది. మరి ఇప్పుడు ఎందుకు ఏడ్చారంటారా.. ఓ కుక్కతో ఒక వ్యక్తికి ఉన్న అనుబంధం ఆధారంగా ఇటీవల కన్నడలో 777 చార్లీ చిత్రాన్ని తెర కెక్కించారు. ఈ చిత్రాన్ని చూసి కర్ణాటక సీఎం బొమ్మై భావోద్వేగానికి గురయ్యారు.

గతేడాది చనిపోయిన తన పెంపుడు కుక్క ఆయనకు గుర్తొచ్చింది. అంతే ఆయనకు కన్నీళ్లాగలేదు. తన పెంపుడు శునకాన్ని గుర్తు చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ కుక్కతో ఆయనకు 14ఏళ్ల అనుబంధం ఉంది మరి. కుక్కల మీద ఎన్నో చిత్రాలు వచ్చినా.. ఇంతగా ఎవరూ బాగా తీయలేదని బొమ్మై అన్నారు. ఈ చిత్రంలో ఒక జంతువులో ఉండే ఎమోషన్ ను బాగా చూపించారని బొమ్మై మెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: