చిన్నప్పటి పాఠ్యపుస్తకాల్లో బాబర్ నుంచి ఔరంగజేబ్ వరకూ మొఘల్ రాజుల పాలన గురించి పాఠాలు ఉంటాయి. అయితే.. చరిత్ర పుస్తకాల్లో హిందూరాజుల గురించి రాయనందునే వారి గురించి ఎవరికి తెలియట్లేదని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అంటున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి చరిత్రకు సంబంధించిన అంశాలు పరిశీలించి.. పుస్తకాల్లో తగిన మార్పులు చేయాలని అక్షయ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. మొఘలుల గురించే కాదు పరాక్రమవంతులైన హిందూరాజుల గురించి విద్యార్థులు తెలుసుకోవాలని కోరుకుంటున్నానంటూ అక్షయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
చేతులు జోడించి కేంద్ర విద్యాశాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తున్నానని చరిత్రకు సంబంధించిన విషయాల్ని పరిశీలించి మార్పులు చేయాలని అక్షయ్ కుమార్ డిమాండ్ చేశారు. మొఘలుల గురించి తెలుసుకోకూడదని కాదు కానీ.. చరిత్రలో సమతూకంగా ఉండాలి కదా అంటున్నారు అక్షయ్ కుమార్. హిందూ రాజులు కూడా గొప్పవారేనని అన్ని అంశాలు అందరి ముందుకు తీసుకువస్తే చర్చిద్దామని అన్నారు.