మోదీ ఆ విధంగా.. తెలంగాణపై కక్ష సాధిస్తున్నారా?

Chakravarthi Kalyan
ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్‌పై చేసిన విమర్శలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా స్పందించారు. దేశంలో అన్ని పార్టీలను ఏకం చేసి మోదీ సర్కారును గద్దె దింపాలన్నది తెరాస లక్ష్యమన్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తామన్న ఎర్రబెల్లి... నల్ల చట్టాలు తీసుకొచ్చి వందల మంది చంపింది భాజపా అన్నారు. ఎన్నికలు వచ్చాయంటే మతం పేరిట చిచ్చు పెట్టే పార్టీ భాజపాయేనని.. తెలంగాణ పట్ల మోదీ కక్ష సాధింపు ధోరణితో ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. విభజన చట్టం హామీలు నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని.. తెరాస కుటుంబ పార్టీ పాలన కాదు.. తెరాస, తెలంగాణ అంతా ఒక కుటుంబం అన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ సీఎం కాకముందే తెలంగాణ ఉద్యమంలో కుటుంబ సభ్యులు ఉన్నారని.. తెలంగాణను కించపరిస్తే ప్రజలు సహించరని.. కేసీఆర్, కేటీఆర్ హార్డ్ కోర్ ఉద్యమకారులని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: