గుడ్‌న్యూస్‌: తెలంగాణలో మళ్లీ ఉద్యోగాలు..!

Chakravarthi Kalyan
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. మొన్ననే గ్రూప్ వన్.. అంతకు ముందు పోలీస్‌ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో రెండు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. అవేంటంటే.. పోలీసు రవాణా విభాగం, ఎక్సైజ్‌ శాఖలో కలిపి 677 కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోలీసు నియామక మండలి తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో ఎక్సైజ్‌ శాఖలో 614 పోస్టులు ఉన్నాయి.  పోలీసు రవాణా విభాగంలో 63 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. ఈ  పోస్టులకు మే 2వ తేదీ నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుంటారు.

ఇప్పటికే పోలీసు శాఖతో పాటు ఎస్పీఎఫ్‌, అగ్నిమాపక, జైళ్ల శాఖలో 16,614 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ నాలుగు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు www.tslprb.in వెబ్‌సైట్‌ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. మే 2 నుంచి 20వ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: