హైదరాబాద్‌: ఈ రూట్లో వెళ్తే చిక్కుకుపోతారు జాగ్రత్త?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో శ్రీరామ నవమి సందర్భంగాభాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి శ్రీరామ శోభాయాత్ర నిర్వహిస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ శోభాయాత్ర జరుగుతుంది. అందుకే హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ శోభాయాత్ర.. సీతారాంబాగ్ ద్రౌపది గార్డెన్స్ నుంచి ఒంటి గంటకు శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. రాత్రి 8 గంటలకు ఈ శోభాయాత్ర సుల్తాన్ బజార్ కు చేరుకుంటుంది. యాత్ర సీతారాం బాగ్ టెంపుల్, బోయిగూడ కమాన్, గాంధీ విగ్రహం, బేగంబజార్, సిద్ధంబర్ బజార్, శంకర్‌షేర్ హోటల్, గౌలిగూడ మీదుగా సాగుతుంది. అక్కడి నుంచి పుత్లీబౌలి ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్ కు వెళ్తుంది.

అందుకే ఈ మార్గాల్లో వెళ్లే వాహనదారులు వేరే దారుల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ యాత్రకు వాహనదారులు సహకరించాలన్నారు. ఈ యాత్ర కారణంగా మల్లేపల్లి జంక్షన్, బోయిగూడ కమాన్, ఆఘపురాజంక్షన్, పురానాపూల్ ఎక్స్ రోడ్ లో ట్రాఫిక్ మళ్లిస్తారు. ముస్లింజంగ్ బ్రిడ్జి, అలస్కా టీ జంక్షన్, లేబర్ అడ్డా, రంగ మహల్ జంన్, ఫుత్లీబౌలీ ఎక్స్ రోడ్, ఆంధ్రా బ్యాంకు జంక్షన్, డీఎం అండ్ హెచ్ఎస్ జంక్షన్, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్ వద్ద కూడా ట్రాఫిక్‌ పోలీసులు మళ్లింపు చర్యలు చేపడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: