కొత్త జిల్లా: కలెక్టర్‌కు వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్?

Chakravarthi Kalyan
కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఏకంగా ఓ వైసీపీ ఎమ్మెల్యే కలెక్టర్‌కే హెచ్చరిక జారీ చేశారు. బొల్లాపల్లి మండలాన్ని నరసరావుపేట రెవెన్యూ డివిజన్ లోకి మార్చాలని బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు. అలా మార్చకపోతే పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూర్చుంటానన్నారు. పల్నాడు జిల్లా ఆవిష్కరణ సభలో మాట్లాడిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. గతంలో  నరసరావుపేట డివిజన్ లో కొనసాగిన బొల్లాపల్లి మండలాన్ని ప్రస్తుతం నూతన జిల్లాల ఏర్పాటులో గురజాల రెవెన్యూ డివిజన్ కు మార్చడాన్ని వ్యతిరేకించారు.


అసలు ఈ విషయాన్ని స్థానిక ఆర్డీఓ తన దృష్టికి తీసుకురాలేదని బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. బొల్లాపల్లి మండలం ప్రజలు గురజాల డివిజన్ కు వెళ్లాలంటే సుమారు 55 కిలోమీటర్లు దూరం వెళ్లాలన్నారు. రహదారి సరిగ్గా లేకపోవడంతో ఆ మండలానికి చెందిన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఈ విషయాన్ని పట్టించుకుని బొల్లాపల్లి మండలాన్ని నరసరావుపేట డివిజన్ కు మార్చాలన్నారు. లేదంటే కలెక్టర్ కార్యాలయం ముందు కూర్చుంటానని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: