అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడ్డ ఇనుప వస్తువులు?

Chakravarthi Kalyan

ఆకాశం నుంచి అకస్మాత్తుగా భారీ ఇనుప శకలం, సిలిండర్‌ వంటి వస్తువు ఊడిపడిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఇక్కడి చంద్రపుర్‌ జిల్లాలోని సిందెవాహి ప్రాంతంలో ఈ శకలాలు పడ్డాయి. లాడ్‌బోర్‌ అనే ఊళ్లో ఇనుప శకలం ఆ దగ్గర్లోని పవన్‌పార్‌ అనే ఊళ్లో సిలిండర్‌ పడినట్లు స్థానికులు చెబుతున్నారు. జనమంతా ఉగాది సంబరాల్లో ఉండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారి ఆకాశం నుంచి మెరుపులతో ఈ వస్తువులు భూమిని తాకాయి. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు. ఇనుప శకలం, సిలిండర్‌లాంటి రెండు వస్తువులు పడ్డాయి.


ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్‌ అజయ్‌ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ముంబయి నుంచి విపత్తు నిర్వహణ బృందం వచ్చి ఈ వస్తువులను పరిశీలిస్తుందన్నారు. గ్రామస్థులు ఈ శకలాలను ట్రాక్టరుపై తీసుకెళ్లి దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అయితే ఈ వస్తువులు ఉపగ్రహ ప్రయోగం తర్వాత కూలిన రాకెట్‌ బూస్టర్‌ అయ్యిండొచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: