మందుకొట్టి పోలీసులకు చుక్కలు చూపించిన లేడీస్‌?

Chakravarthi Kalyan
అసలే కోతి.. ఆ పైకి కల్లు తాగింది.. మళ్లీ నిప్పు తొక్కింది.. అన్న నానుడి వినే ఉంటారు కదా.. ఇప్పుడు ఈ ముంబై అమ్మాయిల పరిస్థితి అలాగే మారింది. అసలై హై ప్రొఫైల్ లేడీస్.. అందరికీ కాస్త పేరున్న కుటుంబాలు.. ఏదో పార్టీకి హాజరై ఫుల్లుగా మందుకొట్టారు. ఆ మత్తులోనే ఎక్కడికో బయలు దేరారు. కారులోనూ బీర్ బాటిల్స్ పెట్టుకున్నారు. అయితే పోలీసులు తనిఖీలో దొరికిన వీరు.. ఏకంగా పోలీసులకే చుక్కలు చూపించారు.

ఓ యువతి తాగి కారును నడపడమే గాక అడ్డుకున్న పోలీసులపై ఆ యువతి ఎదురు తిరిగింది. పోలీసులనే తిట్లు తిడుతూ ఓ పోలీసు అధికారి కాలర్‌ పట్టుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా అవుతున్నాయి. ఈ కారులో మెుత్తం ముగ్గురు యువతులు ఉన్నారు. అంతా మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల ముందే అమ్మాయిలు మందుకొట్టిన దృశ్యాలు ఇప్పుడు ఫోన్లలో చక్కర్లు గొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: