భూమి కబ్జా చేశాడని పరమ శివుడికి నోటీసులు?

Chakravarthi Kalyan
భూకబ్జా కేసులు పెరిగిపోతున్నాయి.  భూమి బంగారంగా మారిపోతోంది. అయితే.. ఓ భూకబ్జా కేసులో ఏకంగా దేవుడికే నోటీసులు ఇచ్చిన ఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఏకంగా పరమ శివుడికే నోటీసులు ఇచ్చేసారు అధికారులు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అంతే కాదు..  ఈ నెల 25న జరిగే విచారణకు హాజరుకావాలని శివుడికి నోటీసులు ఇచ్చారు. విచారణకు రాకకపోతే.. భూమిని బలవంతంగా ఖాళీ చేయిస్తామన్నారు. భూకబ్జా చేసినందుకు రూ.10వేలు జరిమానా కూడా విధిస్తామని ఆ నోటీసుల్లో తెలిపారు. ప్రభుత్వ భూమిలో కొందరు శివాలయం కట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వ భూమి కాబట్టి అందులో ఉన్న శివాలయం సహా మొత్తం 16 మందిని నిందితులేని రెవెన్యూ అధికారులు తెలిపారు. నోటీసులు అందుకున్న వారిలో ఆరో వ్యక్తి పరమశివుడు కావడం విశేషం. ఈ నెల 25న జరిగే విచారణకు రావాలని శివుడికి నోటీసులు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: