ఉక్రెయిన్ యుద్ధం: ఆ నగరంలో రష్యా అరాచకం?
ఉక్రెయిన్ దేశానికి చెందిన అనేక నగరాలను రష్యా సేనలు ముట్టడి చేస్తున్నాయి. క్షిపణులతో విధ్వంసం సృష్టిస్తున్నాయి. జనావాసాలపైనా దాడులు చేస్తున్నాయి. ప్రత్యేకించి రష్యా దాడుల్లో మరియపోల్ అనే నగరం పూర్తిగా ధ్వంసం అవుతోంది. ఈ నగరం దాదాపు నేలమట్టం అయినట్టు తెలుస్తోంది. రష్యా కొన్ని రోజులుగా ఈ మరియపోల్ నగరంపైనే దృష్టి సారించి ధ్వంసం చేస్తోంది. వ్యూహాత్మక ప్రాంతంలో ఈ నగరంలో ఉండటంతో దీనిపై రష్యా కన్నేసింది. రష్యా తీరుతో భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదముందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.