హోలీ.. ఈ రూల్స్ పాటించకపోతే జైలుకే?

Chakravarthi Kalyan
హోలీ.. చిన్నా పెద్దా అంతా ఉత్సాహంగా జరుపుకునే వేడుక.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వేడుక సంబంరంగా జరుపుకుంటారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో ఈ పండుగ సంబరం ఎక్కువ. అందులోనూ హైదరాబాద్ లో అయితే హోలీ రోజు రచ్చ రచ్చ చేస్తారు. అయితే.. ఈ ఏడాది హోలీ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో హోళీ వేడుకలకు పోలీసుల ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


గురువారం ఉదయం 6గంటల నుంచి 19 వ తేదీ ఉదయం 6గంటల వరకూ మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలు జరుపుకోవడంపై నిషేధం విధించారు. అంతే కాదు.. సంబంధం లేని వ్యక్తులపై, వాహనాలపై, భవనాలపై రంగులు పోయడం నిషేధం విధించారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందుకే నిబంధనలు పాటిస్తూ హ్యాపీగా హోలీ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: