పోలవరం: ఇవాళ కీలక భేటీ.. ఏం తేలుస్తారో?

Chakravarthi Kalyan
ఇవాళ ఢిల్లీలో పోలవరం అంశంపై కీలక సమావేశం జరగబోతోంది. ఢిల్లీలోని కేంద్రజలశక్తిశాఖ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్‌ అంశాల పరిష్కారానికి కోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్ తోపాటు కేంద్ర జలసంఘం సభ్యులు, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ నిపుణులు హాజరవుతారు. వీరితో పాటు  కేంద్ర జలవిద్యుత్‌ పరిశోధన కేంద్రం నిపుణులు, డ్యామ్‌ డిజైన్ రివ్యూ ప్యానెల్ సభ్యులు కూడా హాజరవుతారని తెలుస్తోంది.


ప్రాజెక్టు పనులకు అవసరమైన నిధుల సమస్య గురించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు డిజైన్లను ఫైనల్ చేయాలని కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పోలవరానికి సంబంధించి ఇటీవల కీలక పరిణామాలు జరిగాయి. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ స్వయంగా వచ్చి పోలవరం పనులను, నిర్వాసితుల మౌలిక వసతుల నిర్మాణాలను పరిశీలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: