తల్లి కాదు రాక్షసి.. ఏడాదిన్నర బిడ్డను ఏం చేసిందో తెలుసా?
ఇక ఇటీవలే మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో కూడా ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సంవత్సరన్నర వయసున్న బిడ్డ పట్ల కనీస కనికరం చూపించ లేక పోయింది ఆ తల్లి. ఏకంగా దారుణంగా చిన్నారిని బయటకు విసిరినా సంఘటన అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేస్తోంది. ఉజ్జయినిలోని బంద్ నగర్ తహసీల్ లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇక ఈ వీడియో అటు ఇటు చేరి చివరికి పోలీసుల వరకూ వెళ్లింది.
ఇక ఇలా విసిరి వేయబడిన చిన్నారి లతిక వయస్సు సుమారు ఒకటిన్నర సంవత్సరాలు ఉంటుందని చైల్డ్ లైన్ అధికారులు చెబుతున్నారు. కాగా చిన్నారి తండ్రి ధర్మేంద్ర చౌహన్ అనే వ్యక్తి అని గుర్తించారు పోలీసులు. పట్టణంలోనే బాలాజీ దేవాలయం సమీపంలో వీరు నివసిస్తూ ఉన్నారు. అయితే తల్లి కోమల్ ప్రతిరోజు చిన్నారిని దారుణంగా కొడుతూ హింసించేదని స్థానికులు కూడా చెబుతున్నారు.. ఈ క్రమంలోనే ఫిర్యాదు స్వీకరించిన చైల్డ్ లైన్ బృందం ఫిబ్రవరి 24వ తేదీన కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది..