శభాష్‌: అమెరికా ఆఫర్‌కు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు నో..?

Chakravarthi Kalyan
రష్యా దళాలు ఉక్రెయిన్‌లో చొరబడుతున్నాయి. ఏకంగా రాజధాని కీవ్‌ను సైతం ఆక్రమించుకుంటున్నాయి. అయితే.. ఈ సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీను ఆ దేశ రక్షణ దళాలు బంకర్‌కు తరలించాయని వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకు ఓ ఆఫర్ ఇచ్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అనుమతిస్తే అతడిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని తెలిపింది.
అయితే అమెరికా ఆఫర్‌ ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించారు.. ఇప్పుడు ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతోందని.. తనకు కావాల్సింది ఆయుధాలు, సైన్యం తప్ప.. ప్రాణ రక్షణ కాదని గట్టిగనే బదులిచ్చారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోవడానికి సైతం వెనుకాడనని.. దేశం వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ పారిపోనని తేల్చి చెప్పారు. దేశ ప్రజలను కష్టాల్లో వదిలి.. తన ప్రాణాలు మాత్రమే రక్షించుకోవడం సరికాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. కీలకమైన సమయంలో ధైర్యంగా బదులిచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వైఖరిని అంతా ప్రశంసిస్తున్నారు
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: