యుద్ధం మొదలు: ఉక్రెయిన్‌పైకి గర్జిస్తున్న రష్యా మిస్సైళ్లు

Chakravarthi Kalyan
భయపడినంతా జరుగుతోంది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది.. తన పొరుగున ఉన్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించింది. మిలటరీ ఆపరేషన్‌ గా పేరు పెట్టిన రష్యా.. దాన్ని ప్రారంభించామని అధికారికంగానే ప్రకటించింది. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంతోల ఈ మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు రష్యా అధినేత పుతిన్‌ వెల్లడించారు.
అంతే కాదు.. ఉక్రెయిన్‌ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని పుతిన్‌ మిగిలిన ప్రపంచ దేశాలను హెచ్చరించారు. జోక్యం చేసుకుంటే విపరీత పరిణామాలకు దారి తీస్తుందని ముందే వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్‌పై యుద్ధం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్‌ చర్యలకు ప్రతిస్పందనగానే మిలిటరీ ఆపరేషన్‌ చేపట్టినట్టు ప్రకటించారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోవద్దని ముందు నుంచి చెబుతున్నా నాటో దేశాలు తమ మాట పట్టించుకోలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అంటున్నారు. దీనికి బాధ్యత నాటో దేశాలదే అని పుతిన్ పరోక్షంగా చెప్పేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: