టీఆర్‌ఎస్ ఎంపీగా ప్రకాశ్ రాజ్‌.. కేసీఆర్‌ బంపర్‌ ఆఫర్‌..?

Chakravarthi Kalyan
యాక్టర్ ప్రకాశ్‌ రాజ్‌ త్వరలోనే ఎంపీ కాబోతున్నారా.. రాజకీయాల్లో రాణించాలని తపన ఉన్న ప్రకాశ్‌ రాజ్‌ త్వరలోనే పార్లమెంటులో అడుగు పెట్టబోతున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రకాశ్‌ రాజ్‌కు కేసీఆర్‌ రాజ్యసభ టికెట్ ఆఫర్‌ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ ముంబయి టూర్‌లో ప్రకాశ్ రాజ్‌ను వెంటబెట్టుకుని వెళ్లిన సంగతి తెలిసిందే.
ప్రకాశ్ రాజ్‌ నటుడే అయినా.. ఆయనకు జాతీయ రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. దీనికి తోడు ప్రకాశ్‌ రాజ్‌కు బీజేపీ వ్యతిరేకత ఓ పెద్ద ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. ప్రకాశ్ రాజ్‌ కు ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు దక్షిణాది భాషలపై మంచి పట్టు ఉంది. అందుకే ప్రకాశ్‌ రాజ్‌ సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనకు టీఆర్‌ఎస్‌ జాతీయ స్థాయి బృందంలో చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్‌ నుంచి ప్రకాశ్ రాజ్‌ను రాజ్యసభ స్థానానికి పంపితే.. మంచి ఫలితాలు ఉంటాయని టీఆర్ఎస్ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: