కేంద్ర మంత్రికే వార్నింగ్ ఇచ్చిన శివసేన..?

Chakravarthi Kalyan
సీబీఐ, ఈడీ, ఐటీ.. ఇవి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నవారి పాలిట అస్త్రాలుగా మారుతున్నాయి. రాష్ట్రాల‌లో అధికారంలో ఉన్నవారిని.. తమకు నచ్చని పార్టీలవారిని వేధించేందుకు ఈ మూడు వ్యవస్థలను వాడుకుంటున్న దాఖలాలు పెరుగుతున్నాయి. తాజాఈ అంశం మహారాష్ట్రలో శివసేన, బీజేపీ మధ్య మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారి తీసింది.

ఇటీవల కేంద్ర మంత్రి రాణే.. ఉద్ధవ్‌ ఠాక్రే కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు ఈడీ నోటీసులు పంపించబోతోదని కామెంట్ చేశారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై శివసేన కూడా ఘాటుగానే స్పందించింది. సంజయ్‌  రౌత్‌ దీనికి దీటుగా బదులిచ్చారు. రాణే కేంద్రమంత్రి అయితే కావచ్చు.. కానీ ఇది మహారాష్ట్ర.. ఆ విషయం మరిచిపోకండి. మీరే అంటే మేం మీకు బాప్‌.. అంటే ఏంటో తెలుసగా.. మా జాతకాలు మీ దగ్గర ఉందని మీరు అనుకోవచ్చు.. కానీ.. మీ జాతకాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ విషయం మరిచిపోవద్దు... అంటూ సంజయ్ రౌత్‌ ఏకంగా కేంద్ర మంత్రికే వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: