ఆ 5 రాష్ట్రాలకు ఇవాళ కేంద్రం పిలుపు.. కీలక భేటీ?

Chakravarthi Kalyan
ఇవాళ దిల్లీలో గోదావరి-కావేరీ అనుసంధానంపై కీలక భేటీ జరగబోతోంది. నదుల అనుసంధానంపై దృష్టి పెట్టిన కేంద్రం ఈ కీలక భేటీ నిర్వహిస్తోంది. నదుల అనుసంధానం ద్వారా అనేక దక్షిణాది రాష్ట్రాల నీటి సమస్యను పరిష్కరించవచ్చని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రక్రియలో భాగాంగా గోదావరి- కావేరీ నదులను అనుసంధానించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. గోదావరి కావేరీ అనుసంధానంపై చర్చించేందుకు సంబంధిత రాష్ట్రాలను కేంద్రం ఇప్పటికే ఆహ్వానించింది. ఇవాళ ఈ ఐదు  రాష్ట్రాల జలవనరులశాఖ అధికారులతో కేంద్రం దిల్లీలో భేటీ కానుంది.


ఢిల్లీలోని జలశక్తిశాఖ కార్యదర్శి కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో   గోదావరి-కావేరి అనుసంధాన అవకాశాలను గుర్తించి చర్చిస్తారు. ఈ ప్రాజెక్టు ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై సమాలోచనలు జరుపుతారు. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్రం సంబంధిత ఐదు రాష్ట్రాల జలవనరులశాఖ కార్యదర్శులను ఆహ్వానించింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖ కార్యదర్శులను కేంద్రం ఆహ్వానించింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జలవనరులశాఖ కార్యదర్శుల సమావేశం నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: